ఏడుగురు శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

Date:15/04/2019
 హైదరాబాద్ ముచ్చట్లు :
రాష్ట్ర శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన ఏడుగురు సభ్యులు సోమవారం మండలి సభ్యులుగా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి లోని ఇంచార్జ్ చైర్మన్ నేటి విద్యాసాగర రావు వీరితో  ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ,శేరి.సుభాష్ రెడ్డి,యెగ్గె .మల్లేశం,సత్యవతి రాధోడ్,మజ్లీస్ పార్టీ కి చెందిన మీర్జా రియాజ్ హాసన్ లు వరసగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకర రావు,టిఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే టి రామారావు పలువురు శాసన సభ్యులు శాసన సభ కార్యదర్శి నరసింహా చార్య్లులు  శాసనమండలి అధికారులు హాజరు అయ్యారు.
Tags:Seven Legislative Council members are sworn in (revised)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *