Natyam ad

కడప కొండాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు మృతి

కడప  ముచ్చట్లు:


జిల్లాలోని కొండాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ వాహనాన్ని లారీఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తుఫాన్ వాహనంలో తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో తుఫాన్ వాహనంలో 13 మంది వున్నారు. మృతులు తాడిపత్రి, బళ్లారికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 

Tags; Seven people died in a fatal road accident near Kondapuram, Kadapa

Post Midle
Post Midle