కారు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు
తిరుపతి ముచ్చట్లు:
నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారులు రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. రేణిగుంట వాసులు తంజావూరులో శుభకార్యం లో పాల్గొని తిరిగివస్తున్నారు. తిరుపతి బాలాజీ డైరీ సమీపంలో కారు అదుపుతప్పింది. డ్రైవర్ నిద్ర పోవడంతో రోడ్డు దిగి పొలాల్లోకి దూసుకుపోయింది. ఘటనలో ఏడు మందికి గాయాలు అయ్యాయి. వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
Tags: Seven people were injured in a car accident

