Natyam ad

లింగాల మండల కేంద్రంలో ఏడవ రోజు కంటి వెలుగు కార్యక్రమం

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. 19వ తేదీ నుండి లింగాల మండల కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఏడు రోజులపాటు లింగాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోజువారి 150 మందికి  పరీక్షలు చేయడం జరుగుతుందని డాక్టర్ చందులాల్ తెలిపారు. ఇప్పటివరకు 850 మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు విజయవంతంగా వారి యొక్క విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు లింగాల మండల కేంద్రంలో ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనాలని పి.హెచ్.సి డాక్టర్ బికులాల్ గ్రామంలో వార్డు వార్డుల్లో మైకు తో ప్రచారం చేస్తూ ప్రజలందరూ కంటి చూపు తో బాధపడుతున్న వారు మరియు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చి చూయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు ప్రోగ్రాం డాక్టర్ చదూలాల్ . సూపర్వైజర్ వెంకటమ్మ ఏఎన్ఎం పర్వీన్ బేగం. తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Seventh day kanti velam program at Lingala Mandal Centre

Post Midle
Post Midle