లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

ముంబై ముచ్చట్లు:

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లాభనష్టాల్లో మధ్య తీవ్ర ఊగిలాడాయి. అయితే చివరికి లాభాల్లోని ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. గ్లోబల్‌ చమురు ధరల పతనంతో ఆయిల్‌ రంగ షేర్లన్నీ పడిపోయాయి. దీంతో భారీ నష్టాల్లోకి కీలక సూచీలు జారుకున్నాయి. కానీ చివరి అర్థగంటలో భారీగా ఎగబాకాయి. అయితే.. ఒక దశలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్‌ 237 పాయింట్ల లాభంతో 51598 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు ఎగిసి 15350 వద్ద స్థిరపడింది.అయితే చివరికి లాభాల్లో షేర్లు ముగియడంతో మదుపరులు ఊపిరిపీల్చుకున్నారు. మెటల్‌, రియల్టీ, ఆయిల్‌ రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీ పతనం ప్రభావాన్ని చూపడం విశేషం. హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఏసియన్‌ పెయింట్స్‌, ఆల్ట్రా టెక్‌ సిమెంట్‌ లాభపడగా.. ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌,హిందాల్కో, యూపీఎల్‌ ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు భారీగా నష్టాన్ని చవిచూశాయి.

 

Tags: Severe fluctuation between profits and losses .. ultimately the trail of profits

Post Midle
Post Midle
Natyam ad