శాంతిపురం లో తీవ్ర ఉద్రిక్తత.

Date:02/07/2019

శాంతిపురం ముచ్చట్లు;

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లోని శాంతిపురం లో తీవ్ర ఉద్రిక్తత…. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం, బుధవారం తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించ నున్నారు.ఈ సందర్భంగా శాంతిపురం నాలుగు రోడ్ల కూడలిలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ల చంద్రబాబునాయుడుకు స్వాగతం పలికే నిమిత్తం బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.అయితే ఇవి తమ ఫ్లెక్సీలకు అడ్డుగా ఉన్నాయంటూ వెంటనే తీసేయాలని కొందరు వైకాపా అభిమానులు, కార్యకర్తలు గొడవ చేశారు.. ఇరువర్గాల మధ్య మాటలు పెరిగి ఘర్షణకు దారి తీసింది…
ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి.. ఆసుపత్రి పాలయ్యారు… దీంతో కోపోద్రిక్తులైన తెలుగుదేశం ఎమ్మెల్సీ గౌని గారి శ్రీనివాసులు శాంతిపురం నడిరోడ్డుపై బైఠాయించారు.దాదాపుగా మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.అదేవిధంగా వైకాపా కార్యకర్తలు కూడా రాస్తారోకోకు దిగడంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ స్తంభిచి పోయింది.. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ తంతు నంతా గమనిస్తూ ప్రేక్షక పాత్ర వహించారే తప్ప తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం ఆచ్ఛర్యం కలిగిస్తోంది.

 

మా రాజశేఖర జగమున జనుల గుండెల్లో కొలువైన దేవుడవయ్య..

Tags: Severe tension in Shantipuram.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *