చందానగర్ అండర్ రైల్వే బ్రిడ్జి లో చాలాకాలంగా నిలిచిపోయిన మురికినీరు

-చర్యలు తీసుకొని అధికారులు
-ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనచోదకులు

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని చందానగర్ అండర్ రైల్వే బ్రిడ్జిలో వర్షపు నీరు నిండి పోయి ఐదు నెలలు కావస్తున్నా బల్దియా సిబ్బంది నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని వాహనచోదకులు ఆందోళన చెందుతున్నారు, గతంలో కూడా బ్రిడ్జి లో నీరు ఇలాగ నిండితే సబ్మెర్సిబుల్ మోటర్ ఫిట్టింగ్ చేసి మురికి నీటిని బయటికి పంపించేశారు, ఆ సమయంలో వాహన చోదకుల రాకపోకలకు అంతరాయాలు తీరిపోయాయి, ప్రస్తుతము ఇక్కడ నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా ఉందని స్థానికులు వాపోతున్నారు, వంతెనపై నుండి ట్రైన్ లు వెళుతుంటే బ్రిడ్జి లో కదలికలు వచ్చి డ్రైనేజీ లనుండి మురికినీరు అండర్ రైల్వే బ్రిడ్జి లో కి చేరుకుంటుంది, ఈ బ్రిడ్జిని తొలగించి నూతనంగా నిర్మాణాలు చేపట్టాలని గత పది సంవత్సరాల నుండి పాలకులను,  అధికారులనుకోరుకున్న పట్టించుకున్న ఫలితాలు లేకపోయాయి,  రాత్రి సమయంలో     పట్టాలపై నుండి ప్రజలు రాకపోకలు జరుపుతుంటారు, ఇలాంటి సందర్భాలలో ఇదే అండర్ బ్రిడ్జి దగ్గర ఎన్నో ప్రమాదాలు జరిగాయి, ఇలాంటి సమస్యలను రైల్వే అధికారులు, సంబంధిత బల్దియా అధికారులు బ్రిడ్జి సమస్యపై పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,  ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Sewage that has long been stagnant in the Chandanagar Under Railway Bridge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *