సేవాలాల్ మహారాజ్ జయంతి  మార్చి15 రోజున న  సెలవు దినంగా ప్రకటించాలి

ములుగు  ముచ్చట్లు:
బంజారాల ఆరాధ్య దైవమైన  శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్  పుట్టిన రోజు ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలని సేవాలాల్ సేన ములుగు జిల్లా రాష్ట్ర కార్యదర్శి పోరిక రాహుల్ నాయక్ ఒక  తెలిపారు.
ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన    మాట్లాడుతూ దేశ జనాభాలో 14 కోట్ల జనాభా కలిగిన బంజారాలు తెలంగాణలో 60 లక్షలు ఉన్న లంబాడాల ఆరాధ్య దైవమైన.
శ్రీసద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం  అధికారికంగా నిర్వహించాలని ప్రతి ఏటా జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించే సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించక పోవడం
చాలా బాధకరమని వారు వాపోయారు. ఇప్పటికైనా ఈ సంవత్సరం జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించే శ్రీ సంత్  సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్నికి ఆయన విజ్ఞప్తి చేశారు.
 
Tags: Sewalal Maharaj Jayanti should be declared a holiday on March 15