Sex Rocket in Visakha ...

విశాఖలో సెక్స్ రాకెట్…

Date:10/12/2019

విశాఖపట్టణం ముచ్చట్లు:

సాగర నగరం విశాఖలో వరుసగా బయటపడుతున్న సెక్స్ రాకెట్లు అందరినీ కలవరుపరుస్తున్నాయి. పర్యాటక ప్రాంతమైన విశాఖలో టూరిస్టులను టార్గెట్‌గా చేసుకుని వ్యభిచార నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గెస్ట్‌హౌస్‌లు, హోటల్స్‌ను వేదికగా ముఠాలు రెచ్చిపోతున్నాయి. తాజాగా వ్యభిచారం జరుగుతున్న ఓ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. హైటెక్‌ స్థాయిలో ఫోన్లు, సోషల్‌మీడియా ద్వారా విటులను ఆకర్షిస్తున్న ఇద్దరు బ్రోకర్లను అరెస్ట్ చేశారు.హైదరాబాద్‌కు చెందిన సలీమ్‌, బెంగళూరుకు చెందిన నయీమ్‌ కొంతకాలంగా ఇతర రాష్ట్రాల నుంచి యువతులను విశాఖపట్నం తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఏసీపీ త్రినాథరావు ఆదేశాలతో వారిపై నిఘా ఉంచారు. మెలోడీ థియేటర్‌ ఎదురుగా ఉన్న ఓ రెసిడెన్సీ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం దాడులు జరిపారు. ఆ సమయంలో నిర్వాహకులు నయీమ్‌, సలీమ్‌లతో పాటు విటుడుగా వచ్చిన బిహార్‌కు చెందిన ముకుల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన ఓ సెక్స్‌వర్కర్‌ని రక్షించారు. నిందితుల నుంచి రూ.17.350 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రెండో పట్టణ పోలీసుస్టేషన్‌‌కు తరలించారు. ఇటీవల కాలంలో విశాఖ నగరంలోని అనేక హోటళ్లలో వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి పేద యువతులు, మోడళ్లను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. సోషల్‌మీడియా ద్వారా విటులను ఆకర్షించి రూ.వేలల్లో దోచుకుంటున్నారు. ఈ దందాపై అనేక ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసులు పోలీసులు తరుచూ తనిఖీలు చేస్తున్నారు.

 

అయ్యప్ప మాల వేసుకున్నందుకు… స్టూడెంట్ సస్పెండ్

 

Tags:Sex Rocket in Visakha …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *