భార్య తో సెక్స్… పోర్న్ సంస్థలకు అమ్మకం

Date:03/06/2019

ముంబై ముచ్చట్లు:

కామంతో కళ్లు మూసుకుపోయిన వ్యాపారవేత్త నీచంగా ప్రవర్తించాడు. పోర్న్ వెబ్‌సైట్లకు బానిసై భార్యను బజారుకీడ్చాడు. భర్త వింత మనస్తత్వం, వేధింపులతో విసుగు చెందిన ఆ ఇల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన భర్త గురించి చెప్పిన విషయాలు విని పోలీసులకే దిమ్మ తిరిగింది. బెంగళూరులోని సదాశివ నగర్‌లో బయటపడింది ఈ దారుణం. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్త.. బెంగళూరులోని సదాశివ నగర్‌లో కుటుంబంతో కలిసి స్థిరపడ్డాడు. కొద్దిరోజులుగా పోర్న్ వెబ్‌సైట్లకు బానిసై.. వింతగా ప్రవర్తిస్తూ.. లైంగికంగా వేధిస్తున్నాడు. భర్త కదే అని ఆమె భరిస్తూ వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో.. ఆమెకు తెలియకుండా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. పడకగదిలో భార్యతో ప్రైవేట్‌గా గడుపుతూ సీసీ కెమెరాలో రికార్డ్ చేశాడు. తర్వాత సీసీ కెమెరాను ఆమె గమనించింది. అంతటితో ఆగని సదరు వ్యాపారవేత్త.. భార్య ఈ మెయిల్ హ్యాక్‌ చేసి.. ఆమె స్నేహితులకు అశ్లీల మెసేజ్‌‌లు పంపేవాడు. భర్త తీరుతో విసుగెత్తిన ఆమె నిలదీసింది.. దీంతో కోపంతో ఆమెపై దాడి చేసి.. ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆదివారం ఆమె భర్త, అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కొద్దిరోజులుగా తనను వేధిస్తున్నాడని.. తనను నిత్యం అనుమానించేవాడని ఆమె ఆరోపిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఐపీఎల్ ఒత్తిడితో భారత్ లేట్ ఎంట్రీ

Tags:Sex with wife … selling to porn companies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *