కూతుళ్లపై లైంగిక వేధింపులు

Date:04/12/2019

మాస్కో ముచ్చట్లు:

కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతుళ్లపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో తండ్రి. వారిని శారీరకంగా హింసిస్తూ.. లైంగికంగా వేధిస్తూ పైశాచికానందాన్ని పొందాడు. కీచకుడిగా మారిన అతడి బారి నుంచి తమను రక్షించుకునేందుకు ఆ ముగ్గరు బాధితురాళ్లు జన్మనిచ్చిన ఆ నీచుడిని దారుణంగా చంపేశారు. 2018లో రష్యాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసు స్థానిక కోర్టులో విచారణకు వచ్చింది. నేరం రుజువైతే నిందితురాళ్లకు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది.రష్యాకు చెందిన క్రెస్టీనా(20), ఏంజిలీనా(19), మారియా కాచాతుర్యాన్‌(18) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు తండ్రి మైఖేల్‌తో కలిసి నివసించేవారు. మద్యానికి బానిసైన మైఖేల్ నిత్యం తాగొచ్చి కూతుళ్లను చిత్రహింసలు పెట్టేవాడు. అది చాలదన్నట్లు వారిని లైంగికంగా వేధిస్తూ కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చేవాడు. తమ బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేకపోవంతో బాధితురాళ్లు మౌనంగా రోదించేవారు. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.

 

 

 

 

 

 

 

2018 జులై నెలలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మైఖేల్ ఓ కూతురిపై అత్యాచారం చేయబోయాడు. దీంతో సహనం నశించిన ఆ ముగ్గురు అతడిని కత్తితో కసిదీరా పొడిచారు. రక్తపు మడుగులో ఉన్న అతడి తలపై సుత్తితో మోది చంపేశారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితురాళ్లను అరెస్ట్ చేశారు. పెద్ద కుమార్తెలు క్రెస్టీనా, ఏంజెలీనా ఉద్దేశపూర్వకంగా తమ తండ్రిని చంపేశారని పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. ఈ కేసు మంగళవారం విచారణకు రావడంతో న్యాయమూర్తి వాదోపవాదాలు విన్నారు. ఈ సందర్భంగా నేరం రుజువైతే వారికి 20ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశమున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో చట్టాలపై రష్యన్ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గృహహింస చట్టం ఉంటే ఆ ముగ్గురికి తండ్రిని చంపే అవసరమే వచ్చేది కాదని, ఇకనైనా పాలకులు చట్టాలను మార్చాలని మానవ హక్కుల నేతలు కోరుతున్నారు.

 

భ‌ద్ర‌త‌పై జిహెచ్ఎంసి మ‌హిళా ఉద్యోగుల‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సు

 

Tags:Sexual harassment of daughters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *