వాకపల్లి  నిందితులకు లైంగిక పరీక్షలు

Date:07/12/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
 విశాఖ జిల్లా జీ మాడుగుల మండలం వాకపల్లిలో భద్రత, కూంబింగ్ దళాలు అమాయక గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారాని పాల్పడ్డారన్న అభియోగం ఎదుర్కొంటున్న నిందితులకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అభియోగం ఎదుర్కొంటున్న నిందితులకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం గతంలోనే ఆదేశించినప్పటికీ, ఇప్పటి వరకూ జరగలేదు. గత నెల 30న ఇదే అంశంపై న్యాయస్థానం లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించాల్సిందేనంటూ మరోసారి స్పష్టమైన ఆదేశాలివ్వడంతో ఎట్టకేలకు అభియోగం ఎదుర్కొంటున్న నిందితులకు విశాఖ కేజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించారు. కేజీహెచ్ వైద్యుల బృందం ఎండోక్రెనాలజీ విభాగాధిపతి డాక్టర్ కేవీ సుబ్రహ్మణ్యం, సైక్రియాటిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ కుమార్, యూలాజిస్ట్ డాక్టర్ సీహెచ్ సుబ్బారావు ఈ కేసులో అభియోగాలెదుర్కొంటున్న 13 మందికి లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తయ్యాయని, నివేదికను సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించనున్నట్టు సీఎస్ ఆర్‌ఎంఓ డాక్టర్ శాస్ర్తీ తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసిన సంగతి విధితమే.మావోయిస్టుల ఏరివేతలో భాగంగా భద్రతాదళాలు 2007 ఆగస్టు 20 జీ మాడుగుల మండలం వాకపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంలో మావోయిస్టుల ఆచూకీ చెప్పాలంటూ స్థానిక గిరిజనులను విచారించారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది తమపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ గిరిజన మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గిరిజన మహిళలకు ప్రజా సంఘాలు బాసటగా నిలవడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. బాధితులకు న్యాయం జరిగేంత వరకూ పోరాడతామంటూ పలు ప్రజా సంఘాలు ఉద్యమించడమే కాకుండా న్యాయ పోరాటానికి సిద్ధపడ్డాయి.
Tags:Sexual tests for Wakapalli culprits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *