Natyam ad

పుంగనూరులో ఎంపీ మిధున్‌చే మైనార్టీల షాదీమహల్‌ ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బీడీకాలనీలో మజీద్‌సుభాని షాదీమహల్‌ను ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి , చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కలసి ప్రారంభించారు. ఆదివారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, అంజుమన్‌ కమిటి కార్యదర్శి అమ్ము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీలు పాల్గొని గౌస్‌పాక్‌ జెండా దర్గాను ప్రారంభించి ప్రార్థనలు నిర్వహించారు.అక్కడ వెహోక్కలు నాటారు. ఎంపీ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల కోరిక మేరకు గౌస్‌పాక్‌జెండాకు రూ.6 లక్షలు, షాదీమహల్‌కు రూ.6 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. ముస్లిం మైనార్టీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ , మైనార్టీ నాయకులు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌అలిఅహమ్మద్‌, ఎంఎం.సాదిక్‌, అజ్ము, నూరుల్లా, బిజి రఫి, అస్లాంమురాధి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

నాడు-నేడు పనులను ప్రారంభించిన ఎంపీ…

పట్టణంలోణి ఎన్‌ఎస్‌.పేటలో నాడు-నేడు పథకం క్రింద బసవరాజ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రూ.90 లక్షలతో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులకు ఎంపీ మిధున్‌రెడ్డి భూమిపూజ చేసి ప్రారంభించారు. అలాగే లయన్స్క్లబ్‌ ఆధ్వర్యంలో చెవిటి వారికి ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఎంపీ ప్రారంభించారు.

Tags: Shadimahal for minorities inaugurated by MP Midhun in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.