కృష్ణాపురంలో విషాద ఛాయలు
పామర్రు ముచ్చట్లు:
ప్రేమోన్మాది దాడిలో హత్యకు గురైన వైద్య విద్యార్థిని స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తపస్వి మరణ వార్త తాత,నాయనమ్మలు విని కుప్పకూలిపోయారు. అభం శుభం తెలియని తన మనుమరాలిని కర్కశంగా ఎలా చంపగలిగాడంటూ తాత,నానమ్మ పిన్నమనేని గోపాలకృష్ణరావు, బేబిలు ఆవేదన వ్యక్తం చేసారు. మృతురాలు వైద్య విద్యార్థిని స్వగ్రామం పమిడిముక్కల మండలం కృష్ణాపురం. డాక్టర్ గా తిరిగి వస్తుందనుకుంటే , ఇలా జరగడం బాధాకరమని గ్రామస్తుల ఆవేదన. ముంబైలోని ఓ కార్పొరేట్ కంపెనీలో సీఈవోగా తపస్వి తండ్రి పని చేస్తున్నారు.
Tags: Shadows of tragedy in Krishnapuram

