షా..నోరు జారి గల్లరతైందే

Date:27/03/2018
బెంగళూర్ ముచ్చట్లు:
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నోరు జారారు. కర్ణాటకలో తమ సీఎం అభ్యర్థి అయిన యడ్యూరప్ప అతిపెద్ద అవినీతి పరుడంటూ కామెంట్ చేశారు. అయితే ఆ వెంటనే పక్కన ఉన్న వ్యక్తి హెచ్చరించడంతో తన తప్పును సరిదిద్దుకున్నారు. కానీ కాంగ్రెస్‌కు ఈ మాత్రం చాలు కదా. వెంటనే ఆ వీడియోనూ సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చేసింది. సిద్దరామయ్య ప్రభుత్వాన్ని నిందించబోయి.. యడ్యూరప్ప పేరును ప్రస్తావించడంతో ఈ భారీ తప్పిదం జరిగింది. ఓ సమావేశంలో షా మాట్లాడుతూ.. ఈ మధ్యే ఓ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మాట్లాడుతూ.. అత్యంత అవినీతి ప్రభుత్వం కోసం పోటీపడుతున్నది ఎవరైనా ఉన్నారంటే అది యడ్యూరప్ప ప్రభుత్వమే అని అమిత్ షా అన్నారు. ఆ సమయంలో యడ్యూరప్ప పక్కనే ఉన్నారు. షా పొరపాటును గ్రహించిన పక్కనున్న వ్యక్తి వెంటనే ఆయన చెవిలో అసలు విషయం చెప్పారు.
Tags:Shah..Noru jari gallarathaiende

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *