మహాంకాళి అమ్మవారిని దర్శించుకొన్న షా

Shah, who was the mother of Mahangali

Shah, who was the mother of Mahangali

Date:15/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ పర్యటన నిమిత్తం వచ్చిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. హైదరాబాద్ పాతబస్తీలోని సింహవాహినీ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షా వెంట బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు. సింహవాహినీ ఆలయం వద్ద అమిత్ షాకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.
బీజేపీ నేతలు, కార్యకర్తలతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది. తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి అమిత్ షా ఇక్కడికి విచ్చేసిన సంగతి తెలిసిందే. శనివారం  మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అమిత్ షాకు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. బేగంపేట నుంచి దోమలగూడ చేరుకున్న ఆయన ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags:Shah, who was the mother of Mahangali

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *