Natyam ad

తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన షాజీహాన్ భాష

రామసముద్రం

మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి షాజీహాన్ భాష మొదటగా కర్ణాటక రాష్ట్రంలోని కురుడమలై వినాయక స్వామి దేవస్థానంలో పూజలు చేసి అనంతరం గురిజాల పంచాయతీలోని బర్డేపల్లిలో ప్రచారాన్ని ప్రారంభించారు. మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చెంబకూరి వద్ద పెద్ద ఎత్తున స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఊరు నందు షాజహాన్ కు నీరాజనాలు జయ జయ ద్వానాలతో పలికారు బారిడేపల్లిలో మొదటగా రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ క్లిష్ట సమయములో తెలుగుదేశం పార్టీ గెలుపు ఈ రాష్ట్రానికి అవసరమని రామసముద్రం మండల ప్రజలందరూ కలసికట్టుగా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు .

 

 

Post Midle

షాజహాన్ మాట్లాడుతూ రామసముద్రం మండలంలో గుడిసెలు ఉండేటివని పూరి గుడిసెలు లేకుండా అందరికీ ఇల్లు తెప్పించానని రామసముద్రం మండలానికి హంద్రీనీవా కాలువను తీసుకొస్తానని అదేవిధంగా రామసముద్రం మండలానికి డబుల్ రోడ్డు వేయిస్తానని టమేటా మార్కెట్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రామ్ ,చిన్న, బాబు, రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, విజయమ్మ, మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ భాష, మండల మాజీ తెలుగుదేశం పార్టీ కృష్ణంరాజు,విజయ్ స్వామి, సుధాకర్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి సభ్యులు వెంకటస్వామి ,మాజీ సర్పంచ్ రెడ్డప్ప, మాజీ సర్పంచ్ చలపతి, నాయుడు ,మాజీ ఎంపిటిసి ఇంజన్ వెంకటరమణ, తిప్పన్న, మాజీ జెడ్పిటిసి శివశంకర్, పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

 

Tags: Shahjeehan’s language started the Telugu Desam party campaign

Post Midle