ఢిల్లీ వేదికగా అవార్డు అందుకున్న టి-సాట్ సీఈవో శైలేష్ రెడ్డి

• డిజిటల్ విద్యలో విశిష్ట సేవలకు పురస్కారం
• గవర్నన్స్ నౌ సంస్థ ప్రధానం

Date:07/11/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్  ఇన్ ఎడ్యుకేషన్ 2019 అవార్డును అందుకున్నారు.ఢిల్లీ వేదికగా ఐఐపీఎం డైరెక్టర్ ఎస్.ఎన్.త్రిపాఠీ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో గవర్నెన్స్ నౌ అవార్డు అందించింది. టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు శాటిలైట్ తో పాటు డిజిటల్ మీడియాలో భాగమైన ట్విట్టర్, ఫేస్ బుక్, యాప్ తో పాటు యూట్యూబ్ ద్వార ఆధునిక పద్దతుల్లో విద్యా బోధనపాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నాయి.  టి-సాట్ నిపుణ, విద్య ఛానళ్లు డిజిటల్ పద్దతుల్లో మారుమూల ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు అందిస్తున్న విధానాన్ని గుర్తించి ఈ అవార్డు అందచేసింది గవర్నెన్స్ నౌ. గవర్నెన్స్ నౌ గత మూడు నెలల క్రితం భారతదేశంలోని 22 ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి నామినేషన్స్ స్వీకరించి, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ ఇన్ ఎడ్యుకేషన్ 2019 అవార్డులలో భాగంగా  డిజిటల్ విద్యా బోధనకు టి-సాట్ ను ఎంపిక చేసి అవార్డు అందచేసింది. అవార్డు అందుకున్న సందర్భంగా సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ పక్షాన అందించాల్సిన సేవలపట్ల తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. భవిష్యత్ లో మరిన్నినూతన పద్దతులు, రెట్టింపు బాధ్యతతో విద్యాబోధన జరిపేందుకు అవార్డు స్ఫూర్తి నింపిందన్నారు.

పించన్ దారులకు నాయకుల శుభాకాంక్షలు

Tags: Shailesh Reddy, CEO, T-Sat, is the recipient of the award in Delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *