"Shakti" is a genus

"Shakti" is a genus

-దేశ చరిత్రలో పుంగనూరుకు ఘనస్థానం
– నేటితో నిత్యజనగణమనకు వందరోజులు
– పండుగలా చేసేందుకు భారీ ఏర్పాట్లు

Date:22/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

దేశంలో ప్రతి పౌరునిమదిలో దేశభక్తి బావాన్ని కలిగించే జాతీయగీతం జనగణమన. ఈ గేయాన్ని విశ్వకవి రబింద్రనాథ్‌ ఠాగూర్‌ తొలుత బెంగాలి బాషలో గేయాన్ని వ్రాశారు. 1919 ఫిబ్రవరిలో మదనపల్లెలో విడిది చేసిన సమయంలో ఈ గేయాన్ని ఆంగ్లంలోనికి అనువధించారు. జాతీయగేయం పురుడుపోసుకున్నది బెంగాల్‌లో అయితే అనువాదంతో మదనపల్లె చరిత్ర పుటలకు ఎక్కింది. ఇది చరిత్రలో నిలిచిపోయిన ఘట్టాలు. ఇప్పుడు జనగణమనకు మరోఖ్యాతిని తెచ్చిపెట్టిన ప్రాంతంగా పుంగనూరు దేశ చరిత్రలో సుస్థిరస్థానం దక్కించుకోబోతోంది. దీనికి కారణం పుంగనూరు పట్టణంలో ప్రతి రోజు ఉదయం సరిగ్గా 8 గంటలకు జాతీయ గీతం మైకుల్లో ప్రతిధ్వనిస్తుంది. గీతం మైకుల్లో వినపడగానే ప్రక్కన ప్రజలే కాదు రహదారులపై రాకపోకలు సాగిస్తున్న ప్రజలు తమ వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోతాయి. అటెన్షన్‌తో జాతీయ గీతాన్ని గౌరవిస్తూ, ఎక్కడిక్కడే ఆలపించి, వందనం చేశాక అక్కడి నుంచి కదులుతారు. ఆగస్టు 15న ప్రారంభమైన జాతీయ గీతాలాపన ఈ రోజు (శుక్రవారం) తో నిర్విఘ్నంగా వందరోజులు పూర్తి చేసుకుంది. గీతాలాపన ప్రారంభానికి మునుపు పుంగనూరులో పరిస్థితి వేరే… కార్యక్రమం ప్రారంభమైయ్యేకా ప్రజల్లో మార్పు ప్రస్పూఠమౌతోంది. ప్రారంభ రోజుల్లో కొంత ఇబ్బంది కన్పించినా ఇప్పుడు జాతీయ గీతాలాపన పుంగనూరు ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయింది. 8 గంట కొట్టగానే పుంగనూరు ఇప్పుడు అటెన్షన్‌లో నిలబడి జాతీయగీతాన్ని ఆలపిస్తోంది. ఈ తరహా జాతీయగీతాలాపన దేశంలో ఎక్కడ లేదు. అది ఒక పుంగనూరు పట్టణంలోనే జరుగుతోంది. ఇది దేశ చరిత్రలో ఒక రికార్డుగా చరిత్రకు ఎక్కింది.
ఒక్క ఆలోచనతో….

ఈగీతాలాపన ప్రారంభానికి ముందు ముగ్గరు మిత్రులకు కలిగిన ఆలోచనే ఈ చరిత్ర ఘట్టానికి తెరతీసింది. పట్టణానికి చెందిన పి.ఎన్‌ఎస్‌.ప్రకాష్‌ న్యాయవాది వృత్తిలో ఉంటునే జర్నలిజంలో కొనసాగుతున్నారు. పి.అయూబ్‌ఖాన్‌ వ్యవసాయ రైతు, వ్యాపారి , వి.దీపక్‌ అద్దెబస్సులను నడుపుకుంటు జీవనం సాగిస్తున్నాడు. వీరు పుంగనూరు పట్టణ ప్రజలకు ఒక మంచి కార్యక్రమాన్ని పరిచయం చేసి, వారిలోదేశభక్తి భావాన్ని పెంపొందించాలన్న ఆలోచన వచ్చింది. గత జూలై మాసంలో మిత్రులు చర్చించుకున్న పలు అంశాలపై పలు రకాలుగా చర్చించి, విశ్లేశించిన తరువాత జాతీయగీతం జనగణమనకు మించిన దేశభక్తి గీతంకానీ , మరి ఏది లేదని భావించారు. ఆ వెంటనే ప్రతి రోజు జనగణమన ఆలపించేలా ప్రణాళికలు సిద్దం చేసి, ఆచరణకు పూనుకున్నారు. ఈ విషయంలో తమ సహకారం అందించాలని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మను సంప్రదించారు. ఒక్క రోజు కూడ క్రమం తప్పకుండ కొనసాగించాలనుకున్న జనగణమనకు సహకారం అందించాలని విన్నవించారు. దీనికి వర్మ తాము భాగస్వామ్యులౌతామంటు ముందుకు వచ్చారు. దీంతో దేశానికి స్వాతంత్య్రం సిద్దించిన ఆగస్టు 15 కు మించిన మంచి రోజు లేదని అదే రోజున జనగణమనకు శ్రీకారం చూట్టారు. కార్యక్రమం ప్రారంభమైయ్యేకా పుంగనూరు సిటికెబుల్‌కు చెందిన ఎన్‌.ముత్యాలు, లయన్స్క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పి.శివ, యువజన సంఘ నాయకులు సివి.శ్యామ్‌ప్రసాద్‌, కె.రెడ్డిప్రసాద్‌, భానుప్రసాద్‌, గిరిధర్‌, ఇంతియాజ్‌లు ఈ మహత్తర కార్యానికి తాము సహకరిస్తామని అండగా నిలిచి,చేయూతనిస్తున్నారు.

యూనెస్కో గుర్తించింది…

మన జాతీయ గీతానికి అంతర్జాతీయ గుర్తింపు కూడ దక్కింది. 2008లో ఐక్యరాజ్యసమితిలో భాగమైన యూనెస్కో ప్రత్యేకంగా మన జాతీయ గీతాన్ని గుర్తించి ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా మదనపల్లె సమీపంలోని పుంగనూరులో ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టడం చరిత్ర సృష్టించింది. ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు.

నా భాధ్యత ….

పుంగనూరులో నిత్యజాతీయగీతాలాపనను అమలు పరచడం నా బాద్యతతో పాటు అదృష్టంగా భావిస్తున్నాము. దేశ భక్తిని పెంపొందించే కార్యక్రమంలో పుంగనూరు కమిషనర్‌గా తొలిసారిగా బాధ్యతలు చేపట్టి ఇలాంటి మహాత్తర కార్యక్రమంలో మున్సిపాలిటి భాగస్వామ్యంకావడం మరువలేం. కమిటి సభ్యులకు నా అభినందనలు.

– కెఎల్‌.వర్మ, మున్సిపల్‌ కమిషనర్‌. పుంగనూరు.

ఊహించలేదు…

పుంగనూరు దేశ చరిత్రలో రికార్డుల్లో చరగని ముద్రవేసుకుంటుందని ఊహించలేదు. నిత్యగీతాలాపన ఆగస్టు 15న ప్రారంభించి తొలిరోజుల్లో కొద్దిగా ఇబ్బంది కలిగిన ప్రజలు ఎంతో ఉత్సాహంతో ప్రతి రోజు ఆలపిస్తున్నారు. దినచర్యలో గీతాలాపన భాగస్వామ్యమైంది. ఇలాంటి వాటిని మరింతగా అభివృద్ధి చేసుకుంటాం.

– లయన్‌ డాక్టర్‌ పి.శివ, లయన్స్క్లబ్‌ జిల్లా పీఆర్‌వో. పుంగనూరు.

జెండాతో వందనం చేస్తా….

ప్రతి రోజు పాల కేంద్రంలో ఉంటా. 8 గంటలకు జాతీయ రహదారిపై గీతాలాపనలో పెద్దజాతీయ జెండాను పట్టుకుని గీతాన్ని ఆలపించి, వందనం చేయడం అలవర్చుకున్నా. ఇంతటి కార్యక్రమాన్ని పుంగనూరులో ప్రారంభించడం పట్టణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం.

– ముభారక్‌, పాలవ్యాపారి, పుంగనూరు.

టైంపాస్‌ను దేశభక్తికి మార్చా….

ప్రతి రోజు ఇందిరాసర్కిల్‌లో ఉదయం స్నేహితులతో కబర్లు చెప్పుకోవడం అలవాటు. ఆగస్టు 15 నుంచి జాతీయగీతాలాపనకు నా సమయాన్ని కేటాయించి పాల్గొంటున్నా. పుంగనూరులో జాతీయగీతం ఏర్పాటు చేయడంతో మేము దేశంలోనే రికార్డు సృష్టించామని గర్వపడుతున్నాం.

– ఆర్‌.తజ్ముల్లాబాషా, వ్యాపారి, పుంగనూరు.

సైరన్‌ వస్తే పరుగులు…

పుంగనూరులో ఉదయం పోలీస్‌ సైరన్‌ రాగానే ఉలిక్కిపడి జనగణమన గీతాలాపనకు వెళ్తాం. నా వయసులో గత వంద రోజులుగా ఎంతో క్రమశిక్షణకు ప్రజలు అలవాటుపడ్డారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గీతాలాపనకు పుంగనూరు నాందికావడం రాష్ట్ర ప్రజల అదృష్టం. దీనిని మరింతగా పటిష్టపరుస్తాం.

– ఎస్‌.అజీజ్‌బాషా, ముతవల్లి, పుంగనూరు.

బస్టాప్‌లో వందనం….

పట్టణంలోని గోకుల్‌ బస్టాప్‌లో 8 గంటలకు బస్సుకోసం ఉంటాం. జాతీయ గీతాన్ని ఆలాపించి వందనం చేసి, కళాశాల బస్సులో వెళ్తాం. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా పుంగనూరులో నిత్యజాతీయగీతాలాపన చేపట్టినందుకు మేము గర్విస్తున్నాం. మేమంతా భాగస్వామ్యులౌతు ఈ కార్యక్రమాన్ని గొప్పగా చెబుతూ అన్ని ప్రాంతాల్లోను చేపట్టాలని కోరుతున్నాం.

-ఆర్‌.యశ్వంత్‌, బిటెక్‌ విద్యార్థి, పుంగనూరు.

నేడే నిత్య జనగణమన వందరోజుల వేడుకలు

Tags; shakti-is-a-genus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *