Natyam ad

నేతలకు అవమానం…

గుంటూరు ముచ్చట్లు:


గుంటూరులో ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి అవమానం జరిగిన సంఘటనపై నగరపాలక సంస్థ స్పందించింది. ‘‘నగరంలో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుపై అపోహలు వచ్చాయి. 2021 జూన్‌ 5న నాజ్‌ సెంటర్లో బాలు విగ్రహం ఏర్పాటుకు కార్పొరేషన్‌ అనుమతిచ్చింది. అనుమతించిన ప్రదేశంలో కాకుండా మదర్‌ థెరీసా సెంటర్‌లో విగ్రహం పెట్టారు. అనుమతిలేని చోట విగ్రహం ఏర్పాటు చేయడంతో తొలగించాం. నాజ్‌ సెంటర్‌లో విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కళా దర్బార్‌ వారికి చెప్పాం. బాలు గారిని అగౌరవపర్చాలని విగ్రహం తొలగించలేదు. అనుమతిచ్చిన ప్రాంతంలోనే విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి. బీపీ మండల్‌ విగ్రహానికి కూడా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పాం’’ అని గుంటూరు కమిషనర్‌ చేకూరి కీర్తి వెల్లడించారు.అసలేం జరిగిందంటే.. గుంటూరు నగరంలోని మదర్‌ థెరీసా కూడలిలో కళా దర్బార్‌ ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనుమతి లేదంటూ నగరపాలక సంస్థ అధికారులు దానిని తొలగించారు. దీంతో కార్పొరేషన్‌ అధికారులపై కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ చేకూరి కీర్తి తాజాగా క్లారిటీ ఇచ్చారు.

 

 

మరో వైపు గుంటూరులో ఏర్పాటు చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అధికారులు తొలగించడం తెలిసిందే. అయితే, అత్యంత దారుణ రీతిలో ఎస్పీ బాలు విగ్రహం నేడు ఓ మరుగుదొడ్డి వద్ద దర్శనమిచ్చింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కరడుగట్టిన దోపిడీ దొంగలకు దోచుకోవడం తప్ప కళల గురించి, కళాకారుల గురించి ఏం తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. “గాడిదకేం తెలుసు గంధపుచెక్క వాసన అని ఓ సామెత ఉంది. అందుకే నిన్న ఎన్టీఆర్ వంటి మహానుభావుడ్ని అవమానించారు, ఇవాళ గాన గంధర్వుడిని అవమానించారు. ఎస్పీ బాలు మన తెలుగువాడు అని చెప్పుకోవడమే మనకు గర్వకారణం. అటువంటిది, ఎస్పీ   బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అనుమతి లేదంటూ తొలగించడం, ఇంకా ఘోరంగా, తొలగించిన ఆ విగ్రహాన్ని మరుగుదొడ్డి వద్ద పెట్టడం తెలుగుజాతికే అవమానకరం” అని మండిపడ్డారు చంద్రబాబు.ఎస్పీ బాలు విగ్రహం పరిస్థితి తెలిసి మనసు చివుక్కుమందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఎస్పీ బాలును అవమానించినందుకు ప్రభుత్వం వెంటనే తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. అంతేకాదు, ఎస్పీ బాలు విగ్రహం గుంటూరులో ఓ మరుగుదొడ్డి వద్ద ఉన్న ఫొటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు చంద్రబాబు.

 

Post Midle

Tags: Shame on the leaders…

Post Midle