అమ్మతనానికే అవమానం.

-ఆడబిడ్డ పుట్టిందని వదిలేసి వెళ్లింది

Date:06/08/2020

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా తిరుచానూరులో దారుణం జరిగింది. నవమాసాలు మోసి, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అని తెలియడంతో ఓ కర్కశ తల్లి నిర్ధాక్షిణ్యంగా ఆ పసికందుని వదిలేసి వెళ్ళిపోయింది. తిరుచానారు పీఎస్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. తిరుచానూరు ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఓ మహిళ ప్రసవం అనంతరం తన కన్నబిడ్డను తిరుచానూరు పాత బస్టాండ్ దగ్గరున్న భాషా చికెన్ సెంటర్ సమీపంలో వదలి వెళ్ళిపోయింది.కాసేపటికి ఆ ప్రదేశంలో పసికందు ఏడుపు వినిపించడంతో చుట్టుపక్కన ఉన్న వాళ్లు ఆ పురిటి బిడ్డను స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులకు తెలిపింది. పోలీసులు ఆ బిడ్డను శిశు సంరక్షణ సమితికి అప్పగిస్తామని తెలిపారు.

ఓకే ఊరు..ఒకే రిజిస్ట్రేషన్..

Tags: Shame on the sale itself.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *