శంకర్ దర్శకుడు కాదు, గొప్ప శాస్త్రవేత్త

Shankar is not a director, great scientist

Shankar is not a director, great scientist

Date:03/11/2018

చెన్నై ముచ్చట్లు:

ప్రతిష్టాత్మక చిత్రం ‘2.0’ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన అక్షయ్ కుమార్.. శనివారం చెన్నైలోని సత్యం థియేటర్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తమిళంలో ప్రసంగించడం ఆకట్టుకుంది. ‘‘నేను తమిళంలో స్పీచ్ రాసుకున్నా.. ఏమైనా తప్పలు పలికితే క్షమించండి’’ అంటూ అక్షయ్ ప్రసంగించారు. ‘‘ఈ సినిమా ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. శంకర్ దర్శకుడు కాదు, గొప్ప శాస్త్రవేత్త. ఆయన పడిన కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఈ సినిమా కోసం మూడు గంటలసేపు మేకప్ వేసుకునేవాడిని. దాన్ని తీయడానికి మరో గంట సమయం పట్టేది. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుని నమ్మలేకపోయాను. ఇందుకు దర్శకుడు శంకర్‌కు దన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆయన ఈ సినిమా కోసం ఎంతో శ్రమపడ్డారు’’ అని తెలిపారు. ఫిట్‌నెస్ కోసం యాంకర్ అడిగిన ప్రశ్నకు అక్షయ్ బదులిస్తూ.. ‘‘నేను రోజు జిమ్‌కు వెళ్తాను. తెల్లవారుజాము 4 గంటలకు నిద్రలేస్తా. మా నాన్న ఆర్మీలో పనిచేశారు. అయితే, ఈ జీవనశైలిని మా ఇంట్లోవారు నాపై బలవంతంగా రుద్దలేదు. నా జీవితంలో నేను ఒక్కసారి కూడా సూర్యోదయం చూడటాన్ని మిస్ కాలేదని చెప్పుకోడానికి గర్వపడుతున్నా. నేను ప్రతి రోజును ఎంజాయ్ చేస్తా. నా శరీరమే నా ఆలయం’’ అని అన్నారు.

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

Tags:Shankar is not a director, great scientist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *