చౌడేపల్లె ముచ్చట్లు:
మండలంలోని పుదిపట్లలో వెలసిన శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం శాంతి హోమ పూజలు నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త వినోద్‌కుమార్ రెడ్డి తెలిపారు.అభయ ఆంజనేయస్వామి,వైష్ణవిదేవి, నాగభైరవస్వామి ను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వేకువ జామున నుంచి గణపతి పూజ, హోమపూజలు, అర్చనలు, చంఢీ హోమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పూజల అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలు అందజేశారు.
Tags:Shanti Homa Pujas at Vaishnavidevi Temple