కుంకళ్లమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

Date:17/10/2020

ఏలూరు  ముచ్చట్లు:

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో చిన వెంకన్న దత్తత దేవాలయం కుంకుళ్ళమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 వరకు నవరాత్రి ఉత్సవాలు  వేడుకగా  జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ మహారేణుకా దేవి అలంకరణలో కుంకుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుంకుళ్ళమ్మ అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా  ఆలయంలో  ప్రతిరోజూ ఉదయం కుంకుమ పూజలు, చండీహోమం నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు అధికారులు అనుమతిస్తున్నారు. దసరా ఉత్సవాలు సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు.

 

చిత్తడిగా ఉభయ గోదావరి జిల్లాలు

Tags:Sharannavaratri celebrations at Kunkallamma temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *