పోలీసుల అదుపులో శర్మ

Date:18/09/2018
నల్గొండ, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్)
మిర్యాలగూడలో ప్రణయ్ ను అత్యంత కిరాతకంగా నరికి చంపిన హంతకుడిని పోలీసులు గుర్తించారు. బీహార్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అమృత తండ్రి మారుతీరావు నుంచి సుపారీ తీసుకుని ప్రణయ్ ను హతమార్చిన వ్యక్తి పేరు సుభాష్ శర్మ. ఇతను బీహార్ కు చెందిన వ్యక్తి. ప్రణయ్ ను హతమార్చిన వెంటనే మిర్యాలగూడ నుంచి బీహార్ కు వెళ్లిపోయాడు. నల్గొండ నుంచి వెళ్లిన పోలీసులు బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో అతడిని అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం అతనిని బీహార్ నుంచి నల్గొండకు తరలిస్తున్నారు. ఈ సాయంత్రం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరో వైపుకంటికిరెప్పలా చూసుకుంటూ పెంచుకున్న బిడ్డ, తనను కాదని మరో యువకుడితో వెళ్లిపోయిన నేపథ్యంలో, బిడ్డపై ఉన్న అతి ప్రేమ, ఆమె తనకు కావాలన్న బలమైన కోరికతోనే అమృత వర్షిణి భర్త ప్రణయ్ ను హత్య చేయించాలని మారుతీరావు భారీ కుట్రకు పాల్పడ్డాడని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ వ్యాఖ్యానించారు.
ఈ కేసులో ఏ1 నిందితుడు మారుతీరావేనని, మరో ఆరుగురు నిందితులు ఉన్నారని, వారిని నేడు మీడియా ముందు హాజరు పరుస్తామని చెప్పారు. హత్య చేస్తే రూ. కోటి రూపాయలు ఇచ్చేలా డీల్ మాట్లాడుకున్న మారుతీరావు, అడ్వాన్సుగా రూ. 18 లక్షలు ఇచ్చాడని తెలిపారు. ప్రణయ్ పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని బీహార్ వాసిగా గుర్తించామని అన్నారు.
అవతలి వ్యక్తి ధనవంతుడు కావడం వల్లే, హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని, అందుకు మారుతీరావు కూడా అంగీకరించాడని రంగనాథ్ తెలిపారు. ఈ కేసును మూడు రోజుల్లోనే ఛేదించామని, స్క్రీన్ మీద కనిపిస్తున్న పాత్రధారి ఒకరేనని, దీని వెనుక చాలా మంది ఉన్నారని అన్నారు. ఈ కేసులో అమృత వర్షిణి ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నయీమ్ గ్యాంగ్ ల ప్రమేయంపై, విచారణ జరిపిస్తామని, ఈ కేసులో అమృత స్టేట్ మెంట్ తీసుకోవాల్సి వుందని అన్నారు.
వేముల వీరేశం గత జనవరిలో అమృత మామ బాలస్వామిని బెదిరించినట్టు తమ వద్ద ఫిర్యాదు ఉందని, అందువల్లే అమృత అతనిపై ఆరోపించి వుండవచ్చని రంగనాథ్ అభిప్రాయపడ్డారు. ఆమె ఫిర్యాదు చేస్తే, కేసు రిజిస్టర్ చేసి, వీరేశాన్ని విచారిస్తామని, ఈ మూడు రోజుల విచారణలో మాత్రం అతని ప్రమేయంపై ఆధారాలు లభ్యం కాలేదని అన్నారు.
బోడే ప్రసాద్ పై  కేసు నమోదు చేయాలని  కోర్టు ఆదేశం
Tags:Sharma in police custody

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *