Natyam ad

కిష్టంపల్లిలో షర్మిల పాదయాత్ర

మక్తల్ ముచ్చట్లు:


అమర చింత మండలం కిష్టంపల్లి గ్రామంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి  వైఎస్ షర్మిలకు గ్రామస్థులు  ఘన స్వాగతం పలికారు.  షర్మిల మాట్లాడుతూ  కేసీఅర్ హయాంలో అన్ని చార్జీలు మోతే. ఆర్టీసీ చార్జీలను మూడింతలు పెంచారు. ఇల్లు ఇవ్వలేదు కానీ ఇంటిపై పన్ను మాత్రం భారీగా పెంచారు.  ఇప్పుడు నల్లా పై కూడా భారీగా పన్నులు మోపుతరట.  ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే కేసీఅర్ కి లెక్కే లేదు.  వైఎస్సార్ హయాంలో నెట్టెంపాడు,కల్వకుర్తి,భీమా ప్రాజెక్ట్ లను కట్టి లక్షల ఎకరాలకు నీళ్ళు అందించారు. ఇప్పుడు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు పట్టుకొని వెలాడు తున్నాడు.  35 వేల కోట్లు ఉన్న ప్రాజెక్ట్ ను 75 వేల కోట్లకు పెంచారు..కమీషన్ల కోసం.  ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఉంది అని కేసీఅర్ మళ్ళీ కాలు బయట పెట్టాడు.  కేసీఅర్ కి పరిపాలన చేతకాదు. ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. కేసీఅర్ కుటుంబానికి అయ్యింది బంగారు తెలంగాణ. కేసీఅర్ కొడుకు,కూతురుకు,అల్లుడికి పదవులతో బంగారం అయ్యింది.  బంగారు తెలంగాణ అని చెప్పి బీర్లు తెలంగాణ బార్ల తెలంగాణ గా చేశారు.

 

 

గుడి ,బడి కన్నా…వైన్ షాపులు,బెల్ట్ షాపులు ఎక్కువవున్నాయని ఆమె ఆరో్పించారు.
మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేదు. 8 ఏళ్లుగా కేసీఅర్ ఆడింది ఆట – పడింది పాట. 8 ఏళ్లుగా దోచుకున్నారు…దాచుకున్నారు.  కాంగ్రెస్ ,బీజేపీ లు కేసీఅర్ కు అమ్ముడు పోయాయి.  ప్రజల పక్షాన నిలబడేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టాం.  నేను వైఎస్సార్ బిడ్డ..పులి కడుపున పులే పుడుతుంది. ఆఖరి నిమిషం వరకు మీకోసం పరితపించిన వైఎస్సార్ బిడ్డగా మాట ఇస్తున్న.  వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా.  ఫీజు రీయింబర్స్మెంట్, అరోగ్య శ్రీ పథకాలకు పునర్ వైభవం కల్పిస్తాను.  ప్రతి పేద కుటుంభం…ప్రతి పేద వర్గం పక్షాన వైఎస్సార్ బిడ్డ నిలబడుతుందని అన్నారు.

 

Post Midle

Tags: Sharmila Padayatra in Kishtampally

Post Midle