ఉట్కూర్ లో షర్మిలా పాదయాత్ర

నారాయణపేట ముచ్చట్లు:


నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజక వర్గం   ఉట్కూర్ మండలం లక్ష్మీపురం గ్రామం మీదుగా  వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల  ప్రజా ప్రస్థానం పాదయాత్ర  కొనసాగింది. . లక్ష్మి పురం వద్ద పత్తి రైతు కోరిక మేరకు పొలంలో దిగి అరక ( గునక,ఎడ్ల గడెం) పట్టి దున్నారు.  పార్టీ అధికారంలో కొచ్చాక వ్యవసాయాన్ని పండుగ చేస్తానని ఆమె  హామీ ఇచ్చారు. షర్మిలా మాట్లాడుతూ కేసీఅర్ చేసిన మోసాలు ప్రజలు తెలుసుకుంటున్నారు.  గ్రామాల్లో కనీసం ఆసరా పెన్షన్లు ఇచ్చే దిక్కు కూడా లేదు.  వ్యవసాయం పండుగ అని కేసీఅర్ అంటున్నారు…కానీ స్వయంగా రైతులే దండుగ అంటున్నారు. ఉద్యోగాలు లేక ఇంకా బ్రతుకు దేరువుకు వలసలు పోవాల్సిన పరిస్థితి.  ఇక కేసీఅర్ ను నమ్మొద్దు.  వైఎస్సార్ పాలన తేవాలి అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కి అధికారం ఇవ్వండి.  వైఎస్సార్ పథకాలు అన్ని అమలు చేస్తా.  తీసుకున్న రుణాలు అన్ని మాఫీ చేస్తా.  పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్త.  ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్లు ఇస్తానని అన్నారు.

 

Tags: Sharmila Padayatra in Utkur

Leave A Reply

Your email address will not be published.