Natyam ad

షర్మిల క్షమాపణ చెప్పాలి

వరంగల్ ముచ్చట్లు:


రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాలిబాన్ అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉండేది కాదని, కెసిఆర్ గాంధీ వాదంతో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించారని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు.  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం తో కలిసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వైయస్ షర్మిల తెలంగాణ ఉద్యమకారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరేంది కాదని అన్నారు.  చెన్నారావుపేటలో వైయస్ షర్మిల రౌడీలతో పాదయాత్ర చేపట్టారని, తెలంగాణ ఎమ్మెల్యేలను, యు తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా పాదయాత్రలో మాట్లాడడం సరైనది కాదని అన్నారు. కేవలం తెలంగాణలో రాజకీయ పబ్బం గడుపుకోనికే తెలంగాణలో పాదయాత్ర చేస్తుందని తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన వైఎస్ షర్మిల బేషరతుగా  తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సుధారాణి డిమాండ్ చేశారు.

 

Tags: Sharmila should apologize

Post Midle
Post Midle