Natyam ad

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా న‌వ‌గ్ర‌హ హోమం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం న‌వ‌గ్ర‌హ హోమం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మ‌వారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.హోమ మ‌హోత్స‌వాల్లో భాగంగా న‌వంబ‌రు 22 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీ కామాక్షి అమ్మ‌వారి హోమం(చండీ యాగం) జ‌రుగ‌నుంది.ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో  దేవేంద్ర‌బాబు, ఏఈవో  సుబ్బ‌రాజు, సూప‌రింటెండెంట్‌  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  బాల‌కృష్ణ‌, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: Shastroktanga Navagraha Homam in the temple of Sri Kapileswara Swamy

Post Midle