ఏపీ లో శిరోముండనం కేసు.. స్పందించిన రాష్ట్ర పతి కార్యాలయం !

Date:12/08/2020

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ లోనితూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేసిన ఘటన ఏపీలో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. దళిత యువకుడికి శిరోముండంన చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. బాధితుడు వరప్రసాద్ కు అండగా ఉండేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఇటీవలే శిరోముండనం బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఆ లేఖ పై స్పందించిన రాష్ట్ర పతి కార్యాలయం ఆ ఘటన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బాధిత అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఏపీ సాధారణ పరిపాలనా విభాగానికి కేసుకు సంబంధించిన దస్త్రం బదిలీ అయింది. అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబును కలవాలని శిరోముండనం కేసు విషయంలో ఆయనకు సహకరించాలని వరప్రసాద్ కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. ఈ క్రమంలో త్వరలోనే పూర్తి ఆధారాలతో బాధితుడు జనార్ధన్ బాబును బాధితుడు కలవనున్నారు. ఇసుక లారీలను అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారని బాధితుడి అప్పట్లో ఆరోపణలు చేసారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులు తనను తీవ్రంగా కొట్టి శిరోముండనం చేశారని చెప్పారు. దీనితో ఈ విషయం ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.

దేశ రాజకీయాల్లోకి దూసుకొస్తోన్న ప్రియాంకగాంధీ

Tags: Shaving case in AP .. State husband’s office responded!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *