మహిళల రక్షణ పై షీ టీమ్ అవగాహన

కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ,ఐపీఎస్ అదేశాల మేరకు,కరీంనగర్ శాతవాహన కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సైన్స్ వద్ద సోమవారం షీ టీమ్ పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ టౌన్ ఏసిపి తుల శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కరీంనగర్ టౌన్ ఏసిపి తుల శ్రీనివాస్ రావు  మాట్లాడుతూ అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, బయటే కాకుండా సోషల్ మీడియా లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసారు.ఏదయినా ఇబ్బందులకు గురైనపుడు వెంటనే పోలీస్ లని సంప్రదించాలని,షీ టీం సేవలను వినియోగించుకోవాలని తెలియజేసారు.ఈ సందర్భంగా షీ టీం ఇన్చార్జ్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ షీ టీం ని ఎలా సంప్రదించాలో వివరించారు.ఆపద వచ్చినపుడు షీ టీం ని సంప్రదించడం వలన ఎలాంటి సహాయం అందుతుందో పిల్లలకి వివరించారు.ఇట్టి అవగాహన సదస్సులో డయల్ 100 ప్రాముఖ్యత ను,హ్యాక్ ఐ యాప్
పని తీరుని,క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని  వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కరీంనగర్ వన్ టౌన్ సిఐ నటేష్, షీ టీమ్ ఇన్చార్జ్,కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్,షీ టీమ్ ఏఎస్ఐ విజయమని, సుమారు 200 మంది విద్యార్ధినులకి అవగాహన కలుగజేశారు.
 
Tags: Shea Team Awareness on Protection of Women

Leave A Reply

Your email address will not be published.