మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లి మండలం, కొండకింద చౌడేపల్లి అడవిలో గొర్రెలు చనిపోవడం కలకలం రేపుతోంది. ఘటనపై వివరాలు.. మదనపల్లె మండలంలోని పెంచుపాడు గ్రామం, కొండకింద చౌడేపల్లి అడవిలో రెండు గొర్రెలు బావిలో పడి చనిపోయి కనిపిస్తుండగా, బావికి సమీపంలో మరో రెండు గొర్రెలు చనిపోయి ఉండడాన్ని సోమవారం స్థానిక పశువుల కాపర్లు గుర్తించారు. వెంటనే పెంచుపాడు వీఆర్వో స్వామికి సమాచారం అందించారు. చనిపోయిన గొర్రెలు ఎవరివి అన్నది ఇంకా తెలియరాలేదని, స్థానిక గొర్రెల కాపర్లు పేర్కొంటున్నారు. నీళ్లు తాగేందుకు వెళ్లి బావిలో పడి చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్న.. బాబిక సమీపంలోనే మరో రెండు గొర్రెలు చనిపోయి ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని వారు అంటున్నారు. ఈ గొర్రెల మృతి మిస్టరీగా మారిందని దీని వెనక కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొంటున్నారు… గొర్రెలు ఎవరివన్నది తెలిస్తే ఏం జరిగిందని తెలుస్తుందని స్థానికులు చెబుతున్నారు.
Tags: Sheep died in Chaudepalli forest under the hill