చిరుత దాడిలో గొర్రెలు మృతి
అనంతపురం ముచ్చట్లు:
కంబదూరు మండలం అచ్చంపల్లి లో గొర్రెల మంద పై చిరుత దాడి చేసింది. ఘటనలో చిరుత 25 గొర్రెలను చంపివేసింది. అచ్చంపల్లి శివార్లలో గొర్రెల మంద కు యజమాని కాపలా లేని సమయంలో చిరుత దాడి జరిపింది. 25 గొర్రెలు మృతి చెందడం తో రూ.3 లక్షల నష్టం జరిగిందని గొర్రెల మంద యజమాని ఉప్పర మారెన్న వెల్లడించాడు. వన్యప్రాణుల నుండి తమను, తమ గొర్రెలను కాపాడుతూ నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని అటవీశాఖ, రెవిన్యూ అధికారులకు రైతు మారెన్న కోరాడు.
Tags:Sheep killed in leopard attack

