శిల్పారామం స్వీపర్స్, సెక్యూరిటీ సిబ్బందికి 10 నెలలు వేతనాలు తక్షణమే ఇవ్వాలి
-ఏఐటియుసి
కడప ముచ్చట్లు:
కడప శిల్పారామంలో విధులు నిర్వహిస్తున్న స్వీపర్స్, సెక్యూరిటీ సిబ్బందికి గత 10 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయుసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసి. బాదుల్లా, నగర కార్యదర్శి ఉద్దె. మద్దిలేటి లు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక శిల్పారామం ఆవరణలో కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న చాలీచాలని వేతనాలతో కుటుంబాలు నేట్టుకు రావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి ఆప్కోస్ లో చేర్చినామని అంటున్నారే తప్ప ఇంత వరకు వేతనాలు అందలేదని గుర్తు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థల్లో చెల్లిస్తున్నట్లు గానే స్వీపర్స్ కు 6500/-రూ కాకుండా 12000/- రూ, సెక్యూరిటీ కి 8200/- కాకుండా 15వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో శిల్పారామం సిబ్బంది ఓబయ్య, మేరీ, రాములమ్మ ,అనూష వెంకటమ్మ, పాలక్క తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Shilparam sweepers and security personnel should be paid 10 months’ wages immediately