శివసేన నీదా నాదా.
ముంబై ముచ్చట్లు:
మహారాష్ట్రలో మళ్లీ రాజకీయం వేడెక్కుతోంది. మొన్నటివరకు ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన రెబల్ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉద్ధవ్ థాక్రేపై అవిశ్వాసం ప్రవేశపెట్టారు. దీంతో తన పార్టీ ఎమ్మెల్యేలే తను మోసం చేశారంటూ ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేయడం.. అనంతరం నాటకీయపరిణాల మధ్య ఏక్నాథ్ షిండే సీఎం కూర్చీలో కూర్చోవడం జరిగిపోయింది. అయితే ఇక్కడితో మహారాష్ట్ర రాజకీయాలు కొలిక్కి వచ్చాయనుకుంటే ఇప్పుడు తెరపైకి మరో ఆంశం వచ్చి మహారాష్ట్ర రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గం ఓ వైపు శివసేన పార్టీ మాదని చెబుతుంటే.. కాదు మాదేనని థాక్రే వర్గం నేతుల ఉద్ఘాటిస్తున్నారు.ఈ విషయం కాస్త సుప్రీం కోర్టుకు చేరడంతో.. శివసేన ఎవరిదనే విషయాన్ని తేల్చేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని ఇటీవల ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని ఉద్ధవ్ థాక్రే వర్గం కోరింది. అంతేకాకుండా.. ఎమ్మెల్యేల అనర్హత విషయం తేలే వరకు నిజమైన శివసేన ఎవరిదనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో థాక్రే వర్గం వెల్లడించింది. షిండే వర్గం అక్రమంగా తమకు ఎక్కువ మద్దతు ఉందంటూ ఆసత్య ప్రచారాలు చేస్తోందని థాక్రే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు, ఇతర అంశాలు పెండింగ్లో ఉన్న క్రమంలో ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సరికాదని కోరింది థాక్రే వర్గం.
Tags: Shiv Sena neida nada.