మహారాష్ట్రలో శివసేన బలపరీక్ష

Shiv Sena reinforcement in Maharashtra

Shiv Sena reinforcement in Maharashtra

Date:29/11/2019

ముంబై ముచ్చట్లు:

శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం థాకరేకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సచివాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మంత్రాలయకు చేరుకోగానే సీఎం ఉద్ధవ్‌కు సచివాలయ సిబ్బంది స్వాగతం పలికారు. కొత్త ముఖ్యమంత్రిని తమ సెల్‌ఫోన్లలో ఫోటోలు తీసుకునేందుకు సిబ్బంది పోటీ పడ్డారు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాకరే శుక్రవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. శనివారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ బలపరీక్ష శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 3లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ఉద్ధవ్‌కు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చెప్పారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు ఉన్న బలం 162 మంది ఎమ్మెల్యేలు.మహారాష్ట్రలో పార్టీల బలాబలాలు..
బీజేపీ – 105
శివసేన – 56
ఎన్సీపీ – 54
కాంగ్రెస్ – 44
బహుజన్ వికాస్ అగడి – 3
ఎంఐఎం – 2
ప్రహార్ జనశక్తి పార్టీ – 2
సమాజ్‌వాదీ పార్టీ – 2
ఇతరులు – 13

 

`ఇద్ద‌రి లోకం ఒక‌టే` సెన్సార్ పూర్తి.. డిసెంబ‌ర్ 2019 విడుద‌ల‌

 

Tags:Shiv Sena reinforcement in Maharashtra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *