కేంద్రమంత్రి పదవికి శివసేన ఎంపీ రాజీనామా

Shiv Sena resigns as Union minister

Shiv Sena resigns as Union minister

Date:11/11/2019

ముంబయి ముచ్చట్లు:

మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘకాలం కమలనాథులకు నమ్మకస్తుడైన మిత్రుడిగా ఉన్న శివసేన.. ఇప్పుడు ఆ పార్టీతో మొదటికంటా సంబంధాల్ని తెంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. బీజేపీతో సంబంధాలు పూర్తిగా తెంచుకుంటే తప్పించి మహారాష్ట్రలో సేన ఏర్పాటు చేసే ప్రభుత్వానికి తమ మద్దతు ఉండని ఎన్సీపీ చెప్పిన నేపథ్యంలో.. దానికి తగ్గట్లుగా పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు (సోమవారం) రాత్రి 7.30 గంటల లోపు శివసేన తన బలాన్ని ప్రదర్శించుకునే అవకాశాన్ని గవర్నర్ ఇచ్చిన నేపథ్యంలో.. ఆ పార్టీ అధినాయకత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా మోడీ కేబినెట్ లో మంత్రిగా వ్యవహరిస్తున్న తమ పార్టీకి చెందిన ఎంపీ అరవింద్ సావంత్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా.. కొత్త మిత్రపక్షాలకు సానుకూల సంకేతాల్ని పంపేందుకు శివసేన తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సమయం తక్కువగా ఉన్న వేళ.. తమ స్నేహం కోసం చేతులు చాచిన శివసేనకు కాంగ్రెస్.. ఎన్సీపీలు దన్నుగా నిలుస్తాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తమ ఉమ్మడి శత్రువు బీజేపీని దెబ్బ తీయాలని భావిస్తున్న వేళ.. సోనియా.. పవార్లు సేన సంకేతాలకు సానుకూలంగా స్పందించే అవకాశం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

శ్రీవాణి ట్రస్ట్ కు భారీ స్పందన

 

Tags:Shiv Sena resigns as Union minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *