Natyam ad

సాగర తీరానికి పోటెత్తిన శివభక్తులు.

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖ సాగరతీరం శివ భక్తులతో పోటెత్తింది.మహా శివరాత్రి పర్వదినాన భక్తులు చేసిన జాగరణ చేసిన భక్తులు పుణ్య స్నానాల కోసం ఆర్కే బీచ్ కు క్యూ కట్టారు.దింతో సాగరతీరం శివనమస్మరణతో మార్మో గింది.విశాఖ చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం వేల సంఖ్యలో భక్తులు ఉదయమే బీచ్ వద్దకు చేరుకుని సముద్ర స్నాన్నాలు చేశారు.ఆర్కే బీచ్కు పోటెత్తుతున్న భక్తులు
శివరాత్రి సందర్భంగా శివ జాగరణ చేసిన భక్తులు ఉదయమే సూర్య నమస్కారాలు చేస్తూ.. ఇసుకలో ఏర్పాటు చేసుకున్న సైకత లింగాల వద్ద పూజా సామాగ్రిని ఉంచి సముద్ర స్నానాలు ఆచరించారు. ఓ పక్క మిలాన్ 2022 ఆంక్షలు ఉన్నా భక్తులు భారీ సంఖ్యలో వైజాగ్ బీచ్కు చేరు కుంటున్నారు.సాధారణ సమయం లోనే ఆర్కే బీచ్కు స్థానికులు వచ్చి సేదతీరుతుంటారు. శివరాత్రి జాగరణ చేసిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వేకువజాము నుంచే ఆర్కే బీచ్కు క్యూ కట్టి ఆచారాలను పాటిస్తున్నారు.
 
Tags:Shiva devotees flocking to the ocean shore

Leave A Reply

Your email address will not be published.