సొరంగంలోని కూలీలను రక్షిస్తున్న శివయ్య

డెహ్రాడూన్ ముచ్చట్లు:


ఉత్తరాఖండ్ ఉత్తర కాశీలోని సిల్క్యారా టన్నెల్‌ కూలిన దుర్ఘటన జరిగి దాదాపు 16 రోజులు అయింది. 41 మంది కార్మికులు గత 16 రోజులుగా ఆ సొరంగంలో చిక్కుకు పోయారు. వీరిని రక్షించడానికి ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ  సొరంగం నుంచి కూలీలను ఇప్పటివరకు బయటకు తీయలేక పోతున్నారు. అయితే సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు అవసరమైన ఆహారాన్ని, ఆక్సిజన్ ను అందిస్తూ ఉంది. అయితే సొరంగంలో చిక్కుకున్న కార్మికుల భద్రత కోసం ఇప్పుడు స్వయంగా శివయ్య చేరుకున్నాడని స్థానికులు నమ్ముతున్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యం ఇదిగో అంటూ సోమవారం ఈ సొరంగం నుంచి ఒక ఆహ్లాదకరమైన చిత్రం చూపిస్తున్నారు. ఆ చిత్రంలో శివుడు తాండవ భంగిమలో కనిపిస్తున్నాడు. సొరంగంలో చిక్కుకున్న కూలీలను రక్షిస్తోంది భోళాశంకరుడే అని .. ఆయన కైలాష్ నుండి సిల్క్యారా చేరుకున్నారంటూ బాధిత కార్మికుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఈ చిత్రం చూసిన తర్వాత స్థానిక ప్రజలతో పాటు రెస్క్యూ టీమ్‌పై కూడా ఆశలు చిగురించాయి. ఇప్పుడిప్పుడే కార్మికులను సురక్షితంగా సొరంగం నుంచి బయటకు తీసుకుని రావడం ఖాయం అనే ఫీలింగ్ కలుగుతోందని అంటున్నారు.

 

 

 

ఈ శివుడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతున్నాయి. సొరంగం ప్రవేశద్వారంతో ఉన్న ఈ చిత్రంలో శివుడు ప్రత్యక్ష రూపంలో కనిపిస్తున్నాడు.సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా వెలుపలికి రావడానికి కేంద్ర, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. రక్షణ కోసం  సైన్యం కూడా మోహరించింది. అయినప్పటికీ ఇంకా విజయం సాధించలేదు. దేశం మొత్తం దీని గురించి ఆందోళన చెందుతోంది. కార్మికులు ప్రాణాలతో బయటపడాలని  దేశ వ్యాప్తంగా దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఆదివారం ఉత్తర కాశీలోని అన్ని దేవాలయాలలో శివునికి పూజలు చేశారు.బాధిత కూలీలకు ప్రాణదానం చేయమంటూ భగవంతుడిని ప్రార్థించారు. 24 గంటల్లోనే సొరంగం ప్రవేశ ద్వారం వద్ద శివయ్య చిత్రం కనిపించడం దైవానుగ్రహం అంటున్నారు. అంతేకాదు రెస్క్యూ టీమ్ ఏ క్షణమైనా, ఎప్పుడైనా సొరంగం నుండి కార్మికులను బయటకు తీసుకురావడంలో విజయం సాధించవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

Tags: Shivayya protecting the workers in the tunnel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *