అట్టడుగు స్థాయి నుంచి తాసిల్దార్ గా ఎదిగిన శివయ్య

కరోనా తో తాసిల్దార్ శివయ్య మృతి

 

కదిరి ముచ్చట్లు :

 

రాప్తాడు మండల తాహశీల్దార్ బండ్లపల్లి శివయ్య(59) ఆదివారం తెల్లవారుఝామున ఒంటిగంట ప్రాంతంలో కరోనాతో తుది శ్వాస విడిచారు. బండ్లపల్లి శివయ్య స్వగ్రామం కదిరి పట్టణ పరిధిలోని కుటాగుళ్ళ గ్రామం. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన శివయ్య ప్రాథమిక విద్య, హైస్కూల్ విద్య అంతా కూడా కుటాగుళ్ళ, కదిరి ప్రభుత్వ విద్యా సంస్థలలో జరిగింది. విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాలకు ఆకర్షితులై సిపిఐ ఎంఎల్ వ్యవస్థాపకులు కామ్రేడ్ చారుమజుందార్ ప్రధాన అనుచరుడు కామ్రేడ్ ఎస్ ఏ రవూఫ్ శిశ్యిరికం చేశారు. హైస్కూల్ స్థాయిలో విప్లవ గీతాలు పాడడం, నాటకాలు వేయడంలో శివయ్య సిద్ధహస్తులు. ప్రధానంగా విప్లవకారుల గీతాలను ఆలపిస్తూ విప్లవ నేత గాథలను ఒగ్గు కథ రూపంలో వినిపించడంలో శివయ్య కు శివయ్యే సాటి. మాజీ ముఖ్యమంత్రి నందమూరి రామారావు నూతనంగా ప్రవేశపెట్టిన గ్రూప్ ఫోర్ పరీక్షలలో విజయం సాధించి రెవెన్యూ శాఖలో గుమస్తా ఉద్యోగం సాధించారు. అప్పటి నుంచి కదిరి సబ్ డివిజన్ పరిధిలోని తలుపుల గాండ్లపెంట తదితర మండలాల్లో ఆర్ ఐ గాను అనంతరం తహసీల్దార్ గా తనకల్లు తలుపుల కదిరి తదితర మండలాలకు పని చేశారు. ప్రస్తుతం ఆయన అనంతపురం వద్ద గల రాప్తాడు మండల తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈనెల మూడవ తేదీన కరోనాకు గురైన శివయ్య అనంతపురం నగరంలోని సవేరా ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య మెడిసిన్ చదివిన కుమారుడు,వివాహమైన కుమార్తె ఉన్నారు. కాగా శివయ్య మృతి పట్ల కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జొన్న రామయ్య, డాక్టర్ కడపల మోహన్ రెడ్డి అదేవిధంగా తెలుగుదేశం కదిరి నియోజకవర్గ ఇన్చార్జి వెంకట ప్రసాద్,బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారధి ,బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్, బిజెపి నాయకులుఉత్తమ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె ఇందాదుల్లా ఖాన్ తదితరులు తమ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags:Shivayya, who grew up from the grassroots level as a tasildar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *