శివయ్య చెంత వసూళ్ల చింత

-భక్తులకు భారమవుతున్న రాహుకేతు, సర్పదోష నివారణ పూజలు
 
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
 
దక్షిణకాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ క్షేత్రంలో లో రాహు కేతు, సర్పదోష నివారణ పూజలు ప్రసిద్ధి. కానీ ఆలయంలో అర్చకులు చేసే దందా అంతా ఇంతా కాదు ఆధ్యాత్మిక కేంద్రమైన చిత్తూరు జిల్లాలో వాయు లింగేశ్వర క్షేత్రమైన శ్రీకాళహస్తికి భక్తులు తండోపతండాలుగా శివయ్య దర్శనార్థం వస్తుంటారు. సాక్షాత్తు పరమశివుడే కొలువైన దివ్య మంగళకర క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ క్షేత్రంలో రాహు కేతు, సర్ప దోష నివారణ పూజలు ప్రసిద్ధి.ఈ పూజలు చేయించుకోవడానికి సామాన్యులు మొదలు వి.వి.ఐ.పి ల వరకు వాయు లింగేశ్వర క్షేత్రానికి ” క్యూ” కడతారు శ్రీకాళహస్తి దేవస్థానానికి ప్రధాన ఆదాయ వనరుగా ఈ సేవా టికెట్లు ఉందంటే ఈ ఆలయానికి ఎంత ఆదాయం తెచ్చి పెడుటుందో చెప్పనక్కర్లేదు రూపాయలు 500 మొదలుకొని 5000 రూపాయల వరకు ఇ సేవ కు టికెట్ల ధరను నిర్ణయించింది దేవస్థానం. దేవస్థానం టికెట్ కంటే అర్చకులు భక్తుల ఎడల వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. సంభావన పేరిట, దక్షిణ పేరిట.. అర్చకులు భక్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారనే వాదన వివాదానికి కారణమవుతోంది. ఈ ఆలయంలో అర్చకులు అందరూ ఒక గ్రూపుగా ఏర్పడి వాటాలు పంచుకుంటారనే అభియోగం లేకపోలేదు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ సంభావన, దక్షిణ పొందుతున్న దృశ్యాలు రెండూ ఎవరికీ కనబడవు బహుశా శివుడు మూడో నేత్రం తెరీస్తే తప్ప. ప్రక్షాళన చేయాల్సిన కార్యనిర్వహణ అధికారి సైతం నిమ్మకు నీరెత్తినట్టు గా వివరించడం పరిపాటిగా మారిపోయింది. శ్రీకాళహస్తి దేవస్థానం లో ఏడాది లేక రెండవ యేడాదిలో కార్యనిర్వణాధికారి బదిలీ కావడం మామూలైపోయింది
తమ మాటకు అడ్డు వస్తే ప్రక్షాళన చేస్తే ఇక కార్యనిర్వాహణాధికారి బదిలీ పత్రం అదుకోవాల్సిందే అంతటి పవర్ ఈ ఆలయ అర్చకులకే సాధ్యం. ఇకనైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ భక్తులు అభిప్రాయపడుతున్నారు.

గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Shivayya worries about bad collections

Leave A Reply

Your email address will not be published.