శివరాజ్ సింగ్ కు ముందుంది…. ముసళ్లు పండుగేనా…

Date:02/07/2020

భోపాల్ ముచ్చట్లు:

మధ్యప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణకు శివరాజ్ సింగ్ చౌహాన్ రెడీ అయిపోతున్నారు. గత మూడు నెలలుగా ఆయన మంత్రివర్గాన్ని విస్తరించలేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ లో ప్రస్తుతం ఐదుగురు మంత్రులే ఉన్నారు. అదీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన ఏప్రిల్ నెలలో మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఇప్పటి వరకూ మంత్రివర్గాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ చేయకపోవడంతో సొంత పార్టీలోనూ, కొత్తగా వచ్చిన వారిలోనూ అసంతృప్తి నెలకొంది.మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసింది. మార్చి నెలలో కరోనా కొద్దికొద్దిగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కాంగ్రెస్ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చారు. వీరంతా కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో తిరుగుబాగు చేయడంతో అప్పటి కమల్ నాధ్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బలపరీక్ష జరపక ముందే కమల్ నాధ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.అయితే మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సమీక్షలతోనే శివరాజ్ సింగ్ చౌహాన్ కాలం గడిపేశారు.

 

 

వైద్య ఆరోగ్యశాఖకు మంత్రిని పెట్టుకున్న తర్వాత కొంత వెసులుబాటు వచ్చినా ఈలోపు గవర్నర్ లాల్జీ టాండన్ ఆసుపత్రిలో చేరారు. దీంతో మంత్రి వర్గ విస్తరణ జరగలేదు.కానీ మంత్రి వర్గ విస్తరణపై ఎంతమందో ఆశలుపెట్టుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా మంత్రి పదవి కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు 22 మంది కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే వీరిలో పది మందికే అవకాశం ఇస్తారని అంటున్నారు. మిగిలిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అవకాశముంది. జులై మొదటి వారంలో మొత్తం 30 మంది సభ్యులతో మంత్రి వర్గాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జ్యోతిరాదిత్య సింధియాతో పాటు బీజేపీ అగ్రనేతలతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.

అందరివాడుగా ఉండే ప్రయత్నంలో జనసేనాని

Tags:Shivraj Singh’s predecessor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *