పుంగనూరులో 13 నుంచి శివరాత్రి ఉత్సవాలు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని నెక్కుంది గ్రామం వద్ద వెలసియుండు శ్రీఅగస్తీశ్వరస్వామి ఆలయంలో ఈనెల 13 నుంచి శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు శుక్రవారం తెలిపారు. ఆలయంలో 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో 13న ప్రారంభమై 22 వరకు ఉత్సవాలు జరుగుతుందన్నారు. 18 శివరాత్రి పర్వదినాన రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే 20న రథోత్సవము, 22న మహాకుంభాభిషేకము, ధ్వజారోహణము కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

Tags: Shivratri celebrations in Punganur from 13
