Natyam ad

బొరెడ్డి గారి పల్లి గ్రామంలో వైసిపికి షాక్

రాయచోటి  ముచ్చట్లు:

2024అసెంబ్లీ ఎన్నికల నేపద్యంలో వైసీపీకి షాక్ ఇచ్చిన గాలివీడు మండలం బోరెడ్డి గారి పల్లె లోని గ్రామ వైసిపి నాయకులు మరియు కార్యకర్తలు.గ్రామ అభివృద్ధి చెందాలంటే వైసిపిని వీడడం మంచిదని రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి  సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ మహమ్మద్ రఫీ మరియు వైసీపీ నాయకులు ఖాదర్ మోదీన్,లాల్ భాష రామేశ్వర,నాగేశ్వర, నాగార్జున,బాబ్జి,మహమ్మద్, రఫీ,రషీద్,అబ్దుల్లాబీ,రామయ్య కుటుంబాలు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇసుక,మద్యం దోపిడీలు చెయ్యడం తప్ప ఎటువంటి అభివృద్ధి చూపలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొస్తే గ్రామాలను అభివృద్ధి చేయడమే కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గాలివీడు మండల నాయకులు తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post Midle

Tags:Shock for YCP in Boreddy Gari Palli village

Post Midle