Natyam ad

కాకతీయ, తెలంగాణ వర్శిటీలకు షాక్

వరంగల్ ముచ్చట్లు:


హ‌మ్మ‌య్య స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌యి బాస‌ర ఐఐఐటి విద్యార్ధులు ఆనందంలో మున‌క‌లేస్తున్నారు. ఎండా వాన‌ల‌కు, రాత్రిప‌గ‌లు అన‌క‌, అధికారుల బెదిరింపులు, హెచ్చ‌రిక‌ల‌కు వెర‌వ‌క సాగించిన  ఆందోళ‌న స‌త్ఫలితాన్నే ఇచ్చింది. మొత్తానికి ప్ర‌భుత్వం కొండదిగి వ‌చ్చి విద్యార్ధులు కోరిన డిమాండ్ల‌ను అంగీక రించింది. రెగ్యులర్‌ వైస్‌ చాన్స్‌లర్‌ నియామకం సహా వసతి గృహాల్లో సమస్యల పరిష్కారం, ఇతర మౌలిక, విద్యాపర మైన వసతులు, సౌకర్యాల కల్పనకు ఏడు రోజుల పాటు నిరసన చేపట్టిన నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు.. చివరకు అనుకున్నది దక్కించుకున్నారు. వారి డిమాండ్లన్నిటినీ  నెల రోజుల్లోగా  తీర్చేందు కు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి అధికారులు ప్రకటిం చారు.  కాగా, విద్యార్థులు లేవెనెత్తిన అంశాలపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బాసర ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి వీసీ రాహుల్‌ బొజ్జా, విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం మధ్యాహ్నం  హైదరా బాద్‌లో చర్చించారు.

 

 

ఈ సందర్భంగానే రెగ్యులర్‌ వీసీ నియామకానికి ముగ్గురు సభ్యులతో సెర్చ్‌ కమిటీ ఏర్పాటు సహా విద్యార్థుల డిమాండ్ల అంగీకారానికి మొగ్గుచూపింది.మంత్రి స‌బిత‌, రాహుల్‌ బొజ్జా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ,  నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూ ఖీ, ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సతీశ్‌ కుమార్‌ బాసర కు రాత్రి వెళ్లి  11 గంటలకు విద్యార్థి నాయకులతో చర్చల కు ఉపక్రమించారు.  అయితే విద్యార్ధి నాయ‌కులు మంత్రిని ప్ర‌భుత్వ అంగీకారాన్ని రాత‌పూర్వ‌కంగా ఇవ్వాల‌ని కోరారు. అందుకు రాత‌పూర్వ‌కంగా ఎందుకు మంత్రిగా  చెబుతున్నానుక‌దా అని మంత్రి స‌బిత  సున్నితం గా వారి విన‌తిని  తిర‌స్క‌రించారు. విద్యార్థులు మంత్రి చెప్పినదానికి అంగీకరించినట్లు తెలిసింది. ప్రభు త్వం నుంచి డిమాండ్ల పరిష్కా రానికి అంగీకారం రావడంతో విద్యార్థులు నిరసనను విరమిస్తు న్నట్లు అధి కారులతో కలిసి వెల్లడించారు. చర్చలు సఫలం అయినట్లు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సతీశ్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు.ఇదిలా వుండ‌గా మ‌రోవైపు హ‌నుమ‌కొండ‌లోని కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం (కేయూ), నిజామాబాద్ డిచ్‌ప‌ల్లి లోని తెలంగాణా విశ్వ‌విద్యాల‌యం(టీయూ) లో విద్యార్ధులు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించాల‌ని ఆందోళ‌న కు దిగారు. కేయూలో  విద్యా సంవత్సరం ప్రారంభమైనా వసతి గృహాలను తెరవకపోవడం, మరమ్మతుల ను నిర్లక్ష్యంగా చేపడుతుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమావేశాన్ని అడ్డుకుని రిజి స్ట్రార్‌ చాంబర్‌ను ధ్వంసం చేశారు.

 

 

 

Post Midle

భౌతిక తరగతులు నిర్వహించకుండా ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో తాత్సారం చేయడం పట్ల సోమవారం తొలుత వర్సిటీ పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు.భవనంలోకి దూసుకుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, రిజిస్ట్రార్‌, ఇతర అధికారుల నుంచి వసతి గృహాలను తెరిచే విషయంలో స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గుర య్యారు. పోలీసులను చేధించుకుని పరిపాలన భవనం పై అంతస్తులో ఉన్న రిజిస్ట్రార్‌ చాంబర్‌లోకి దూసుకెళ్లారు.కేయూలో  విద్యా సంవత్సరం ప్రారంభమైనా వసతి గృహాలను తెరవకపోవడం, మరమ్మ తులను నిర్లక్ష్యంగా చేపడు తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమావేశాన్ని అడ్డుకు ని రిజిస్ట్రార్‌ చాంబర్‌ను ధ్వంసం చేశారు. భౌతిక తరగతులు నిర్వహించకుండా ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో తాత్సారం చేయడం పట్ల సోమవారం తొలుత వర్సిటీ పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. భవనంలోకి దూసుకుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అధికా రులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, రిజిస్ట్రార్‌, ఇతర అధికారుల నుంచి వసతి గృహాలను తెరిచే విషయంలో స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. పోలీసు లను చేధించుకుని పరిపాలన భవనం పై అంతస్తులో ఉన్న రిజిస్ట్రార్‌ చాంబర్‌లోకి దూసుకెళ్లారు.విద్యార్థులు రిజిస్ట్రార్‌ చాంబర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నా ఫర్నీచర్‌, ఇతర వస్తువు లను పగులగొట్టారు. రిజిస్ట్రార్‌, ఇతర అధికారులు వారిస్తున్నా వినలేదు. వసతి గృహాలను తెరవాలంటూ అక్కడే కూర్చొని వాదనకు దిగారు. హామీ ఇస్తేనే వెళ్తామని మొండికేశారు. దీంతో కొద్దిసేపు అధికారులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసుల జోక్యంతో శాంతించారు. రెండు రోజుల్లో వసతి గృహాలు తెరవకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ విద్యార్థులు ఆందోళనను తాత్కాలి కంగా విరమించారు.అవసరమైతే బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల తరహాలో తామూ వర్సిటీలో నిరసనలు చేపడతామని తేల్చి చెప్పారు. దీంతో వీసీ రవీందర్‌, రిజిస్ట్రార్‌ శివశంకర్‌లు.. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. వారంలోగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు మాత్రం తక్షణ పరిష్కారం కోరారు. ఈ నేపథ్యంలో వీసీ.. ప్రిన్సిపాల్‌ హారతి, వర్సిటీలోని వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలివ్వడంతో విద్యార్థులు శాంతిం చారు.

 

Tags:Shock to Kakatiya and Telangana universities

Post Midle