సొంత పార్టీ ఎమ్మెల్యేలకు షాక్

వరంగల్ ముచ్చట్లు:

 

ఎం కేసీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించారు. అయితే సీఎం వరంగల్‌ పర్యటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా పాసులు జారీ చేసి మీడియా కవరేజ్‌కి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై జర్నలిస్టులు సీరియస్‌గా ఉన్నారు. పోలీసులు తీరు సరికాదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు నర్సంపేట అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి సీఎం పర్యటన సంద్భంగా అవమానం జరిగింది.హన్మకొండ మీదుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తున్న ఆయనకు అనుమతి లేదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హెడ్ క్వార్టర్స్ వద్దనే పోలీసులు నిలిపివేయడంతో మనస్థాపం చెందిన సుదర్శన్ రెడ్డి కారు దిగారు. అనంతరం హెడ్ క్వార్టర్స్ నుంచి అర్‌అండ్‌బీ అతిథి గృహం వరకు నడిచివెళ్లారు. పోలీసుల తీరుకు నిరసనగా అధికార పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.సొంత పార్టీ ఎమ్మెల్యే సీఎం వద్దకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని స్థానిక నేతలు మండిపడుతున్నారు. దీనికితోడు ఏక శిలా పార్క్ వద్ద సీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి వెళ్లినా అనుమతి లేదని పోలీసులు మరోసారి ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపం చెందారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Shock to own party MLAs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *