కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:


కెనడాలోని అంటారియో ప్రావిన్‌లో భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పోలీస్‌ సహా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన గత సోమవారం మిల్టన్‌లో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి గాయపడ్డాడని హాల్టన్‌ ప్రాంతీయ పోలీస్‌ సర్వీసెస్‌ తెలిపింది. మృతుడిని సత్వీందర్‌ సింగ్‌గా గుర్తించారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. సత్వీందర్ సింగ్ ఎంకే ఆటో రిపేర్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాల్పుల్లో అతను గాయపడ్డాడని, ఈ ఘటనలో టొరంటో పోలీస్ కానిస్టేబుల్ ఆండ్రూ హాగ్, ఎంకే ఆటో రిపేర్ యజమాని షకీల్ అష్రఫ్ మృతి సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు సీన్‌ పెట్రీ (40) మరణించాడు.

 

Tags: Shooting in Canada.. Indian student killed

Leave A Reply

Your email address will not be published.