సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం.
సిద్దిపేట ముచ్చట్లు:
సిద్దిపేటలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. తొగుట మండలం వెంకట్రావుపెట్ – జప్తిలింగారెడ్డిపల్లి శివారులో దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు తిరుపతి – వంశీ అనే వ్యక్తులు భూవివాదంలో ఈ ఘటన జరిగింది. ఒగ్గు తిరుపతి కి చెందిన వ్యక్తులు.. వంశీ పై కాల్పులు జరిపినట్లు సమాచారం. గతంలో వంశీకృష్ణ ఒగ్గు తిరుపతి పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సిపి శ్వేత సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Tags:Shooting in Siddipet district