ఆగ్నిప్రమాదంలో దుకాణాలు దగ్దం

విశాఖ పట్నం     ముచ్చట్లు:

పాయకరావుపేట పట్టణంలో  గౌతమ్ థియేటర్ సమీపంలో శుక్రవార వేకువ జామున జరిగిన అగ్నిప్రమాదంలో అయిదు కూరగాయల దుకాణాలు,మూడు చేపల దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.పది లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. షాపుల్లో ఉన్న కూరగాయలు,మూడు వందల కిలోల చేపలు,రెండు వందల కిలోల రొయ్యలు మొత్తం సామగ్రి కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాధితులను శాసనసభ్యులు,అసెంబ్లీ కమిటీ ఎస్.సి వెల్ఫేర్ చైర్మన్ గొల్ల బాబురావు పరామర్శించారు,వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  రెవెన్యూ అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Shops burned in the fire

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *