Natyam ad

షార్ట్ సర్క్యూట్స్ స్కూల్ బస్సు దగ్ధం

-తప్పిన పెను ప్రమాదం

అవనిగడ్డ ముచ్చట్లు:

Post Midle

ఎన్టీఆర్ జిల్లా  కోడూరు మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో శనివారం ఉదయం రేపల్లెకు చెందిన శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన స్కూల్ బస్  షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతి అయింది. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో  పెను  ప్రమాదం తప్పింది. ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు సమాచారం . ఉదయం డైవర్ బస్సు స్టార్ట్ చేసే సమయానికి ఒక్కసారిగా మంటలు రావడంతో డ్రైవర్ బస్సులోంచి దిగి వేసి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఆ సమయంలో  స్కూల్ బస్సులో విద్యార్థులు ఎవరు కూడా లేరు. హుటాహుటిన  అవనిగడ్డ  ఇంజన్ సిబ్బంది వచ్చి  మంటలు ఆర్పి ప్రయత్నాలు చేశారు. అప్పటికే బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. సంఘటన ప్రాంతాన్ని స్థానిక రెవిన్యూ అధికారులు పరిశీలించారు.

 

Tags: Short circuits school bus fire

Post Midle